Odisha CM: నేడే ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
- నేడు సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం ప్రమాణస్వీకారం..
- ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మోహన్ మాఝీ..
- మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha CM: ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రవతీ పరిడా, కేవీ సింగ్‌దేవ్‌లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాఝీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ (బుధవారం) సాయంత్రం సీఎంగా మోహన్ చరణ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వాన తొలి పత్రికను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథస్వామికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఇక, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌ను సైతం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు సైతం హాజరుకాబోతున్నారు. 147 సీట్లున్న ఒడిశాలో ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టబోతుంది.
Read Also: Reasi Terror Attack : రియాసి ఉగ్రవాది స్కెచ్ రిలీజ్ చేసిన పోలీసులు.. పట్టిచ్చిన వారికి రూ.20లక్షలు
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
కాగా, ఒడిశా బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మోహన్ చరణ్ మాఝీ.. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా, అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్ స్థానం నుంచి ఆయన గెలిచారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1997-2000 వరకు సర్పంచ్‌గా పని చేసిన ఆయన.. 2000వ సంవత్సరంలో తొలిసారి ఒడిశా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009, 2019తో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా మాఝూ ఎదిగారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!