Russia - Ukraine Conflict: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా ఉత్తర కొరియా, రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కిమ్ సైనికుల్లో కొందరు చనిపోయారని వ్లొదిమీర్ జెలెన్స్కీ తాజాగా వెల్లడించారు.
Elon Musk: కెనడాలో పార్లమెంటరీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
US F-15 Fighter Jets: పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్-15 ఫైటర్జెట్లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది.
Susie Wiles: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేశాడు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌ను విజయ తీరాలకు చేర్చడంలో ఆమె కీ రోల్ పోషించింది.
Israeli Airstrikes Beirut: లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ఆస్ట్రేలియా టుడేపై కెనడా ఆంక్షలు విధించింది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు చేయకుండా బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Maharashtra Election: నేటి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ బీఎన్ఎస్ 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో కనుచూపు మేర మంచు దుప్పటి కప్పేసింది. భారీగా మంచు కురుస్తుంది. ఎడారి రోడ్లపై మంచును చూసి స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది.