Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Lagacharla Incident: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనలో పరిగి పీఎస్లో సమీక్ష ముగిసింది. ఈ మీటింగ్ లో అదనపు డీజీ మహేష్ భగవత్, ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Jagga Reddy: మంచి పనిని చెడ్డ పనిలా చూపించడంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ బిజీ ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారు.
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.
Raghuramakrishnaraju: ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఈరోజు (బుధవారం) నామినేషన్ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
Minister Satya Kumar: మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు. శాసన మండలిలో నేను నవ్వుతూ సమాధానం చెప్పానని జగన్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా అని ప్రశ్నించారు.
AP Home Minister: అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు తెలుసా అని అడిగారు.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని వైఎస్ జగన్ అడిగారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.