Supreme Court: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ చేసింది. నియామక ప్రక్రియ ప్రారంభానికి ముందే ఒకసారి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే.. ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని చెప్పుకొచ్చింది.
Read Also: Andhra Pradesh: 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం.. 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన
అలాగే, నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చేందుకు కుదరదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇవి కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలన్నారు. ఈ ఐదుగురు సభ్యుల బెంచ్‌లో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.
Read Also: Disha Patani : సీకే బ్రాండ్ తో కోట్లు సంపాదిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. మామూలు గ్లామర్ కాదు బాబోయ్
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కచ్చితంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్ట్ బెంచ్ పేర్కొంది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపింది. దీంతో 2008లో కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచ్ సమర్థించినట్లైంది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి ఛాన్స్ లేదని చెప్పుకొచ్చింది.