Supreme Court: పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
China Virus: అందరు భయపడుతున్నట్లే జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) సోకింది అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధ్రువీకరించింది.
Syria: సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. అనంతరం సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఈ నూతన సర్కార్ లో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ వెల్లడించారు.
ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని తెలిపాడు. ఇక, ధోనీ ఈ దేశానికి హీరో.. వ్యక్తిగతంగా, క్రికెటర్గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నాను.. మిస్టర్ కూల్ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషభ్ పంత్ వెల్లడించారు.
Justin trudeau: కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలిగే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ వార్త సంస్థల్లో కథనాలు ప్రచారం చేశాయి.
Panchayat se Parliament 2.0: దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సెషన్స్, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఈరోజు (జనవరి 6) లోక్సభలో స్టార్ట్ కానుంది.
Dallewal Health Update: పంజాబ్- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది.