Buddha Air Flight: నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి భద్రాపూర్‌కు వెళ్తున్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఫ్లైట్ లోని ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని తక్షణమే అధికారులకు నివేదించాడు. అనంతరం విమానాన్ని త్రిభువన్ విమానాశ్రయానికి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Supreme Court: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ..
కాగా, ఈ సమస్యపై బుద్ధ ఎయిర్‌లైన్స్ రియాక్ట్ అయింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని తిరిగి కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించామని వెల్లడించారు. ఈరోజు ఉదయం 11:15 గంటలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని చెప్పారు. మా సాంకేతిక టీమ్ ప్రస్తుతం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తోందని తెలిపారు. మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని బుద్ధ ఎయిర్‌లైన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చింది.
Buddha Air flight makes VOR landing at Tribhuvan International Airport in Nepal's Kathmandu after sustaining a flame out from the left engine. The aircraft had 76 people on board including the crew: Tribhuvan International Airport pic.twitter.com/IHbxcXriRk
— ANI (@ANI) January 6, 2025