Sam Altman: ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు గుప్పించింది. దాదాపు పదేళ్ల పాటు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండు దేశాలలోని కార్మికులు, వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా ప్రజలు లాభపడుతున్నారని అతడు తెలిపాడు.
Elon Musk: భారత్, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని చెప్పుకొచ్చాడు.
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.
JPC First Meeting: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం ఈరోజు (జనవరి 8) జరగబోతుంది.
ISRO New Chief: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ ఎంపికయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి ఆయన ఈ నెల 14వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Asaram Bapu: 2013 అత్యాచారం కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపుకు వైద్యపరమైన కారణాలతో మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ రోజు (జనవరి 7) అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను 'చునావి (ఎన్నికల) ముసల్మాన్' అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్టర్‌తో విడుదల చేసింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది.