HMPV Virus: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి.
Earth Quake: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. ఈరోజు ( జనవరి 7) ఉదయం ఇక్కడ భూకంపం సంభవించడంతో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా రికార్డు అయింది. ఇప్పటి వరకు సుమారు 36 మంది చనిపోయిగా.. మరో 32 మందికి గాయాలు.
కెనడాలో పాలిటిక్స్ హీటెక్కింది. ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు చెప్పుకొచ్చారు.
Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది.
Donald Trump: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కెనడాను యునైటెడ్ స్టేట్స్ లో 51వ రాష్ట్రంగా విలీనం చేసే ప్రతిపాదనను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు.
Bird Flu: అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర కలకలం రేపుతుంది. లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
English Language: ఇంగ్లిష్ భాష సంభాషణా నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని ఓ అంతర్జాతీయ రిపోర్ట్ వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ నిలిచింది.
భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని కోసం 'భారత్‌పోల్' అనే పోర్టల్‌ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో మరోసారి చైనా వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. డ్రాగన్ కంట్రీలో వెలుగు చూసిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) కేసులు భారత్‌లోనూ గుర్తించిన నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.