HMPV Case: చైనాను అతలాకుతలం చేస్తున్న HMPV వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదు అయింది. 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు తెలుస్తుంది. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఈ కేసు నమోదైంది. ఇక, దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని చెప్పుకొచ్చింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చింది.. దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొనింది. అయితే, ఈ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.