Akali Dal Crisis: భారతదేశంలోని గురుద్వారాల నిర్వహణకు బాధ్యత వహించే సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. సిక్కుల అత్యున్నత తాత్కాలిక అధికారం అయిన అకల్ తఖ్త్‌కు తాను కట్టుబడి ఉన్నానని ధామి చెప్పారు. అయితే, దమ్‌దామా సాహిబ్ జాతేదార్ గా జియాని హర్‌ప్రీత్ సింగ్‌ను SGPC ఇటీవల తొలగించడంపై ఫిబ్రవరి 13న జతేదార్ రఘ్‌బీర్ సింగ్ ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జియాని హర్‌ప్రీత్ సింగ్‌ను తొలగించడం చాలా ఖండించదగినది, దురదృష్టకరం అని అన్నారు.
Read Also: Delhi New CM: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి బీజేపీ బిగ్ ప్లాన్..! దేని మీద ఫోకస్ పెట్టిందంటే…!
ఇక, దుష్ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో ఫిబ్రవరి 10న SGPC ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ నుంచి హర్‌ప్రీత్ సింగ్‌ను తొలగించింది. అతడు మాజీ బామ్మర్ది గురుప్రీత్ సింగ్ చేసిన ఆరోపణలను ముగ్గురు సభ్యుల ప్యానెల్ దర్యాప్తు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ సభ్యులు విచారణ చేస్తున్నప్పటికీ.. హర్‌ప్రీత్ సింగ్‌ను తొలగించడం వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన సింగ్ మాట్లాడుతూ.. నాపై వచ్చిన ఆరోపణలు వ్యక్తిత్వ విధ్వంసానికి ప్రయత్నించడం తప్ప మరొకటి కాదు అన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) 2008 లోనే ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసింది. ఒక కమిటీ ఏర్పడింది.. నాతో పాటు నా బంధువులు, స్నేహితులు, సహోద్యోగులను ప్రశ్నించారు. ఫలితంగా నేను అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందాను అని హర్‌ప్రీత్ సింగ్ చెప్పారు.