Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ కు తీవ్ర అవమానం జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక దగ్గర కనిపించినప్పటికీ.. భారత జెండా మాత్రం కనిపించలేదు.
UK PM Keir Starmer: రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతు ఇవ్వడంలో యూకే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు భద్రతా పరంగా అండా ఉండటానికి యూరప్ దేశాలు రెడీ అవుతున్నాయి.
PM Modi: ఈ రోజు (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు.. అందరు ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు.
Delhi BJP: అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా నిరీక్షణ కొనసాగుతోంది. అయితే, ఈ నిరీక్షణకు ఈరోజు (ఫిబ్రవరి 17) తెరపడే అవకాశం ఉంది.
Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్లు పేర్కొనింది.
Piduguralla: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే రెండు సార్లు కోరం లేకపోవడంతో వాయిదా పడగా.. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా టీడీపీ ప్లాన్ చేసింది.. దీంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
CM Chandrababu: టెంపుల్ సీటి తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో జరగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ లు పాల్గొననున్నారు.
Srikalahasti: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక, కాళహస్తీ ఆలయంలో 50 రూపాయల టికెట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.