Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసింది. దీని ఎఫెక్ట్ పిల్లల ఆరోగ్యంపై ఉంటుందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) ఇచ్చిన నివేదికలో తెలింది. అలాగే, అక్రమ నిల్వలు, గడువు ముగిసిన చిక్కీలను పంపిణీ చేయడంపై అందిన నివేదిక ఆందోళన కలిగిస్తుంది. ఈ చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Chilukuru: రంగరాజన్‌పై దాడి కేసులో పోలీస్ కస్టడీకి ‘రామరాజ్యం’ వీర రాఘవరెడ్డి
అయితే, గుడ్లు, అరటిపండ్ల తినని పాఠశాలలోని పిల్లలకు వేరుశనగ-బెల్లం చిక్కీని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2021 డిసెంబర్ చివరలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు చిక్కీ నమూనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ను కోరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది పిల్లలు వేరుశెనగ మిఠాయిని పోషకాహార సప్లిమెంట్‌గా ఎంచుకున్నారు. మరోవైపు, డిసెంబర్ 2022లో పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు అందించిన డేటా ప్రకారం.. 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే చిక్కీలను తినడానికి ఇష్టపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు తమ మధ్యాహ్న భోజనంలో గుడ్లను ఎంచుకున్నారు. చిక్కీని అనుబంధ ఆహారంగా ప్రవేశపెట్టిన ఒక ఏడాది తర్వాత 1 నుంచి 8 తరగతుల ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల నుంచి ఈ డేటాను సేకరించారు.