Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు
- మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు..
- బీజీపీకి దూరంగా ఉంటున్న హోం శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే..
- ఏక్‌నాథ్ షిండే పార్టీ ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించిన సీఎం ఫడ్నవిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరి సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించబడినప్పటికీ, శివసేన నుంచి వచ్చిన వారి కంటే ఈ సంఖ్య చాలా తక్కువ ఉంది.
Read Also: Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి!
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
అయితే, రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మంత్రులు కాకపోయినా, ఈ ఎమ్మెల్యేలకు అదనపు ప్రయోజనంగా వై-భద్రతా మంజూరు చేయబడంతోనే ఈ తొలగింపులు జరిపినట్లు టాక్. 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోవడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పతనానికి దారితీసింది. దీంతో పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రతను మహారాష్ట్ర సర్కార్ కేటాయించింది.
Read Also: MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..
ఇక, ఈ నిర్ణయంతో ఏక్‌నాథ్ షిండే, బీజేపీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. తాజా చర్యతో సీఎం ఫడ్నవీస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడగా కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, దావోస్ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి ఎన్‌సీపీకి చెందిన తత్కరే (శ్రీవర్ధన్)ను రాయ్‌గఢ్ సంరక్షక మంత్రిగా నియమించారు. దీంతో రాయ్‌గఢ్, నాసిక్‌లకు సంరక్షక మంత్రి పదవుల కోసం బీజేపీ, షిండే పార్టీల మధ్య ప్రారంభమైన ప్రతిష్టంభన – ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమిలో స్పష్టంగా విభేదాలు కనిపిస్తుండటపై శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం పదవి రాకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఫడ్నవీస్‌తో వేదిక పంచుకోవడానికి ఏక్‌నాథ్ షిండే దూరంగా ఉంటున్నట్లు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!