సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి.. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
Gorantla Madhav: అనంతపురం జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు. సెక్షన్ 35/ త్రి బీఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. మార్చ్ 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని మాజీ ఎంపీ మాధవ్ కు నోటీసులు అందజేశారు.
Chelluboyina Venu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చారు.. తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మోసం అర్థమైపోయిందన్నారు.
Posani Krishna Murali: అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు.
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు.
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
Vizag: విశాఖపట్నంలో మందుల కోసం వచ్చి మెడికల్ షాప్ దగ్గరే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయనగరం జిల్లా బుదరాయవలసకు చెందిన రమణ (60)గా గుర్తింపు.
AP Cabinet: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
Nandamuri Balakrishna: కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Narayana: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం వెళ్లింది.