Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. అందరినీ మోసం చేసినట్లే రైతులను కూడా దగా చేసిన బడ్జెట్ ఇది.. బాబు షూరిటీ.. నో గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సంగతి గతం మోసం.. వర్తమానం మోసం.. భవిష్యత్ మోసం అనేలా ఉందన్నారు. ఏం చెప్పాలో అర్థం కాక తండ్రీ, కొడుకులను పొగడటం.. జగన్ ను దూషించటంతోనే సరిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రజల ఆకాంక్షలు తీర్చే అంశాలు ఏవీ లేవు.. ఆర్థిక మంత్రి తన పదవి కాపాడుకోవటానికి లోకేష్ ను పొగడాల్సి వచ్చింది.. ప్రభుత్వం వచ్చాక ఎంతమందికి ఎంత బకాయిలు చెల్లించారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేతిలో రైతులు మరోసారి మోసపోయారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
Read Also: Deputy CM Pawan: రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది..
ఇక, బాబు షూరిటి ఇస్తే మోసం గ్యారంటీ అని మాజీమంత్రి కాకాణి అన్నారు. వీళ్ళ బడ్జెట్ వల్ల జగన్ పరపతి వంద రెట్లు పెరిగింది.. మా హయాంలో చెప్పినవన్నీ చేశాం.. చంద్రబాబు వచ్చాడు మళ్ళీ మొత్తం నాశనం చేశాడు అనేలా పాలన కొనసాగబోతోంది.. రైతుల పట్ల రెండు వందల నాలుకల ధోరణి.. గత ప్రభుత్వ హయాంలో చెప్పిన దానికన్నా ఎక్కువే ఇచ్చాం.. గతంలో విమర్శించిన నోటితోనే దాన్ని మరచి కేంద్రంతో కలిపి రైతులకు 20 వేలు ఇస్తామని చెబుతున్నారు చంద్రబాబు.. ఖర్చు చేసేది అనుమానం.. ఇప్పుడు ఎంతమంది రైతులకు కోత పెడతారో అర్థం అవుతుంది.. మీరు ఇచ్చిన బడ్జెట్ లో వ్యవసాయానికి సరిపడా నిధులు లేవు అని తేల్చి చెప్పారు. వ్యవసాయం సరిగ్గా లేకుంటే పరిపాలన గాడి తప్పుతుంది.. జగన్ మిర్చి యార్డుకు పోయి రాగానే విన్యాసాలు మొదలు పెట్టారు.. రైతాంగాన్ని మేము ఆదుకున్నాం అనేలా మాట్లాడటం సిగ్గు చేటు.. జగన్ తెచ్చిన ఆర్బీకే వ్యవస్థ ఉండకూడదనే దుర్మార్గమైన ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.. కొత్త కొత్త పదాలు వాడారు.. టెక్నాలజీని రైతులకు దూరం చేశారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Also: New Motor Vehicle Act: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి ఈ తప్పులు చేశారో భారీగా ఫైన్!
అయితే, కూటమి ప్రభుత్వం చెప్పే మాటలు.. చేసే చేతలకు పొంతన లేదని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. కేవలం పదాలు చెబితే సరిపోదు.. చిత్తశుద్ధి కావాలి.. వ్యవసాయ శాఖ మంత్రి తూకానికి సరిపడా అయినా ధరల స్థిరీకరణ నిధి పెడితే బాగుండేది.. రూ. 300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి సరిపోవు.. గతంలో రైతులను ఆదుకోవటం కోసం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం.. రైతులకు భరోసా ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. రైతులకు కరెంట్ కనెక్షన్లు అడిగితే సోలార్ తో ముడిపెడుతున్నారు.. చంద్రబాబుకు అధికారంలో ఉంటే పాడి రైతులు గుర్తుకు రారు.. హెరిటేజ్ ను లాభాల్లోకి తీసుకు రావాలనే ఆయన తపనపడతారు.. బడ్జెట్ డొల్ల.. రైతులు గుల్ల.. ఇది మంచి ప్రభుత్వం కాదు.. రైతులను ముంచే ప్రభుత్వం అని ఆరోపించారు. విజన్ లేదు విజ్దమ్ లేదు.. ప్రచార మోత.. ప్రజల తలరాత అంటూ ఎద్దేవా చేశారు. లక్ష్యం లేకుండా బడ్జెట్ పెట్టడం దుర్మార్గం.. రైతులను మోసం చేసిన చంద్రబాబు.. మొక్కుబడిగా బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం.. ఇరిగేషన్ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయల అవసరం ఉంటే కేవలం 300 కోట్ల రూపాయలను పెట్టారని మాజీ మంత్రి కాకాణి అన్నారు.