SSMB-29: దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో భారీ మూవీ వస్తోంది. ప్రస్తుతం ఒరిస్సాలోని కోరాపుట్ లోని కొండల నడుమ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియలో లీక్ అయి నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది.
Vizag: విశాఖపట్నంలో ఎన్నారై మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్టీవీ వరుస కథనాలపై పోలీస్ యంత్రాంగం కదిలింది. ఇప్పటి వరకు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వరుసగా కథనాలు ప్రసారం అయ్యేసరికి పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలోకి పోయింది.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది
Priyanka : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా బాలీవుడ్ లో అనేక సార్లు కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదురయ్యాయని ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక.. అటు హాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేసింది.
సంఖ్య బలం మండలిలో ఉందని వైసీపీ సభ్యులు వస్తున్నారు.. మండలిలో వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మేము ఎండకడుతున్నాం.. అలాగే, సీనియర్ నాయకులు అయిన సోము వీర్రాజు మాతో పాటు గళం విప్పుతారు.. ఇక, స్వర్ణంధ్ర ప్రదేశ్ ని తీర్చిదిద్దెందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని మంత్రి సత్య కుమార్ చెప్పుకొచ్చారు.
Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షాక్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు.
Jyothika: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా మీద వచ్చిన విమర్శల మీద తాజాగా హీరో సూర్య భార్య జ్యోతిక ఫైర్ అయింది. భారీ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో వచ్చిన కంగువా సినిమా మీద రిలీజ్ కు ముందు బోలెడన్ని అంచనాలు ఉండేవి.
Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Sajjala Ramakrishna Reddy: ఈ నెల 12న చేపట్టిన 'యువత పోరు' ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
Pushpa Team: పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.