Satya Kumar Yadav: ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీల్లో బీజేపీ తరపున సీనియర్ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు నామినేషన్ వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారం ఆశీర్వాదం కోరడం జరిగింది.. బీజేపీ సిద్ధాంతంతో పార్టీ విస్తరణ కోరకు నిరంతరం సోము వీర్రాజు సేవలు అందిస్తున్నారు.. ఎమ్మెల్సీ స్థానానికి సరైన అభ్యర్థిగా అతడ్ని ఎన్నుకోవడం జరిగింది.. గతంలో శాసన మండలి సభ్యుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.. విశేష అనుభవంతో శాసన మండలిలో బీజేపీ అడుగు పెడుతుంది.. సంఖ్య బలం మండలిలో ఉందని వైసీపీ సభ్యులు వస్తున్నారు.. మండలిలో వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మేము ఎండకడుతున్నాం.. అలాగే, సీనియర్ నాయకులు అయిన సోము వీర్రాజు మాతో పాటు గళం విప్పుతారు.. ఇక, స్వర్ణంధ్ర ప్రదేశ్ ని తీర్చిదిద్దెందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని మంత్రి సత్య కుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు
ఇక, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆధ్వర్యంలో మేము కలిసి పని చేస్తామన్నారు. రెండోసారి కౌన్సిల్ సభ్యుడిగా ప్రవేశిస్తున్నాను.. కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు సీఎం చంద్రబాబు అమోదించారు.. వారికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం అడిగిన వెను వెంటనే కేంద్రం సహకారం అందిస్తుంది.. అభివృద్ధికరమైన కార్యక్రమాలకి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని సోము వీర్రాజు పేర్కొన్నారు.