Sajjala Ramakrishna Reddy: యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
- 12న 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. విద్యార్థుల సమస్యలను తీర్చే వరకు పోరాడుదాం.. అన్ని సంఘాలను కలుపుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఈ నెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు నిరసన కార్యక్రమంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, విద్యార్ధి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్ధి నాయకులు, మేధావులు, విద్యారంగ ప్రముఖులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని తెలిపారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాడదామని సజ్జల వెల్లడించారు.
Read Also: Madhya Pradesh: ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాల్లో రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పు్
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఇక, అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు మెమోరాండంను సమర్పించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ పోరులో యువత, విద్యార్ధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇక, రాష్ట్రంలోని 13 యూనివర్శిటీల నుంచి వీలైనంతమంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేయాలి అన్నారు. రేపు (11.03.2025) యూనివర్శిటీల లోపల లేదా బయట యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్ధను ఎలా నిర్వీర్యం చేసిందో వివరించాలన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్ధ ఎలా ఉంది.. ఆ తర్వాత విద్యార్ధి, యువత ఎలా నష్టపోయిందనే అంశాలు వారికి తెలియజేయాలన్నారు. ఆ తర్వాత 12న జరిగే యువత పోరు నిరసన కార్యక్రమంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీల నుంచి విద్యార్ధులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి వారి డిమాండ్‌లు వినిపించాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైనప్పుడే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని సజ్జల చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!