పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు. పుష్ప మూవీ వచ్చి నాలుగు నెలలు కావస్తోంది. కానీ, త్రివిక్రమ్ సినిమా మాత్రం ఇంకా పట్టాలెక్కట్లేదు. చాలా రోజులుగా త్రివిక్రమ్ కూడా సైలెంట్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమా తీసి భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు ఈ మాటల మాంత్రికుడు. దాని తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు.
Read Also: CM Yogi: యూపీ రైతులకు సీఎం శుభవార్త.. గోధుమ మద్దతు ధర పెంపు
కానీ, పుష్ప-2తో బన్నీ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. కాబట్టి తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చే సినిమా ఆ స్థాయిలోనే ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ ఓ పట్టాన కథను ఒప్పుకోవట్లేదంట. అంతేకాక అట్లీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో త్రివిక్రమ్ కూడా త్వరలోనే మరో హీరోతో సినిమా చేయాలని భావిస్తు్న్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వెంకటేశ్ తో ఎప్పుడో సినిమా చేయాల్సింది. అజ్ఞాతవాసి సినిమా టైమ్ లోనే ఇద్దరూ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.
Read Also: Jyothika: కంగువా కంటే చెత్త సినిమాలు చాలా వచ్చాయి.. నటి జ్యోతిక ఫైర్..
కానీ అప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు త్రివిక్రమ్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ముందు వారితో అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలు చేశాడు. తనకు వరుసగా మూడు హిట్లు ఇచ్చాడు కాబట్టే ఆ నమ్మకంతో అల్లు అర్జున్ మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు బన్నీతో సినిమాకు గ్యాప్ దొరికింది కాబట్టి వెంకటేశ్ కు ఇచ్చిన మాట ప్రకారం ఓ సినిమా చేసేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడంట త్రివిక్రమ్. పైగా బన్నీ కూడా వరుసగా ఆరేళ్ల పాటు పుష్పకు టైమ్ కేటాయించాడు కాబట్టి కాస్తంత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ త్రివిక్రమ్ కు కలిసొస్తోంది.