దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైంది. 25 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
Home Minister Anitha: విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇక, స్త్రీ నిధీ చెక్కును మహిళలకు మంత్రి అందజేసింది.
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.
Nadendla Manohar: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పూర్తి భద్రతకి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో వంద శాతం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు.. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం..
IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తుంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనుంది. ఇక, భారత, న్యూజిలాండ్ క్రికెటర్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు.
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.
CM Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (మార్చ్ 8న) మార్కాపురం వెళ్లనున్నారు. ఇక, 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11.15 గంటల వరకు అధికారులతో భేటీ కానున్నారు.