MLA Kunamneni: బడ్జెట్ కి సంబందించి అనేక ఆశలు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ, ఆ ఆశలు తీరే విందంగా లేదు.. కేవలం కేంద్రం సపోర్టు లేకుండా.. అప్పులపై బడ్జెట్ నెరవేరడం కష్టం.. అలా తీరాలంటే మంత్రదండం కావాల్సి ఉంటుంది.. కేంద్రానికి ఒక్క రూపాయి ఇస్తే.. 41 పైసా వస్తుంది.. ఇక్కడి పరిస్థితికి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుంది.. ఎన్నికల్లో పోటా పోటీగా ఎన్నో హామీలు ప్రకటించారు.. ఇప్పటికే, రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లకు చేరింది అన్నారు. ఇక, ఉన్నంతలో ప్రాక్టికల్ గా ఈ బడ్జెట్ పెట్టారు.. గొప్పలకు పోకుండా ఈ బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు.. గత ఏడాది వాస్తవ బడ్జెట్ కంటే 25 వేల కోట్లు గ్యాప్ ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: మందకృష్ణతో నాకేం విభేదం లేదు.. కానీ ఆయన కిషన్ రెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు
అయితే, రుణ మాఫీ ఇప్పుడు ఉండదు కాబట్టి ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇది కొంత బెటర్ మెంట్.. ఓవరాల్ గా ప్రాజెక్టులకి కేటాయించిన బడ్జెట్ చాలదని నా ఉద్దేశం.. యంగ్ ఇండియా స్కూల్స్ కి 2900 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.. వాస్తవానికి 11,600 కోట్లు పెట్టాలి.. మరి ఇది నాలుగు ఏళ్లకు పెట్టరా.. లేక ఒక్క ఏడాదికి పెట్టరా తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ బాగానే ఉంది.. కానీ, అది అమలు అవుతుందా లేదా చూడాలి.. ఏదేమైనా ఈ బడ్జెట్ కొంత తీయగా.. కొంత చేదుగా కలిసి ఉంది.. ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై కొట్లడితే కొంత సాధ్యం అవుతుంది.. ఖర్చు పెట్టకుండా అభివృద్ధి జరిగేవి చూడాలి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ఈ బడ్జెట్లో పెట్టలేదు.. పని భద్రతా కల్పించే అంశం లేదు.. ఆదాయ మార్గాలు ప్రభుత్వం వెతకాలి.. జర్నలిస్టులకు కూడా పని భద్రత లేదు.. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు.. ఉద్యోగులకు అందాల్సినవి.. అందుతున్నాయా లేదా చూడాలి.. ఈ బడ్జెట్ అందరికీ అందుతుందని నేను అనుకోవడం అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు.