MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన.. శుభ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Minister Seethakka: శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రాష్ట్రం పరువు తీస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరువు తీసింది ఎవరు? అని ప్రశ్నించింది.
MLC Kavitha: శాసన మండలిలో బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం కేసీఆర్ ని నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారు.. అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని పేర్కొన్నారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
NABARD: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు.
Cyber Security SP: బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్సీ ప్రసాద్ అన్నారు. 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయింది.
Alleti Maheshwar Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్.. ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు.. కానీ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.. గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Off The Record: అక్కడ వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా తయారైందా? మూడు నియోజకవర్గాల్లో అయితే... అసలు ఫ్యాన్ స్విచ్చేసే దిక్కే లేకుండా పోయిందా? పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకునే అవకాశం వచ్చినా లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదా? చెయ్యాల్సిన చోట పని చేయకుండా పక్క నియోజకవర్గాల్లో పెత్తనాలు ఎక్కువయ్యాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకంత దారుణంగా మారింది?.
Off The Record: కూటమిలో ఇక కాపు తమ్ముళ్ళకు ప్రమోషన్లు ఉండవా? సైకిల్ పార్టీ కాపు నాయకులంతా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా? చేతికాడికొచ్చిన పదవుల్ని వాళ్ళొచ్చి తన్నుకుపోతున్నారంటూ... టీడీపీ కాపులు తెగ ఫీలైపోతున్నారా? ఇంతకీ వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నదెవరు? ఎందుకు పసుపు కాపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది?.