Minister Nara Lokesh: ప్రభుత్వం శాశ్వతం.. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అని ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసపాలనతో బ్రేక్ చేశారు.
Drugs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీం దాడుల్లో ఐసీస్ డ్రగ్ కలకలం రేపింది. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్ అమ్మకాలను గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉన్న భార్గవ్ మెడికల్ షాప్ లో ఈ ఐసిస్ డ్రగ్స్ ను గుర్తించారు.
Tirumala Rush: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది.
Minister Narayana: నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. పనుల్లో అలసత్వం వహిస్తే సహించం.. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి.. ప్రతీ లే అవుట్ లో పార్కుకు స్థలం వదలాలి.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టాము.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (మార్చ్ 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్..
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
Harish Rao: రాష్ట్ర శాసన సభ చరిత్ర లో ఇది చీకటి రోజు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభ వాయిదా వేశారు.. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది.. 20 శాతం కమిషన్ ఏ ప్రభుత్వం హయంలో జరగలేదు.. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టులు కట్టాం.. రైతు బంధు ఇచ్చాం.
Deputy CM Bhatti: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది అని ఆరోపించారు. వాళ్ల హయాంలో బడ్జెట్లో 38 శాతం ఖర్చు పెట్టలేదు, ఆ నిధులను ఎవరికి కేటాయించారు అని అడిగారు.