Alleti Maheshwar Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్.. ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు.. కానీ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.. గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 మాసాలైన గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరపడం లేదు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవం కాదా.. వాస్తవం అయితే ఎందుకు కేసులు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. దోచుకున్న సొత్తును రీకవరి చేసి ఆరు గ్యారంటీలకు ఖర్చు చేయాలి అని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటిలకు కేటాయించిన నిధులు సరిపోవు.. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్నారు.. పారదర్శకత, జవాబుదారీతనం అంటే అప్పుల వివరాలను బయట పెట్టకపోవడమేనా? అని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అడిగారు.
Read Also: Ranbir Kapoor : ఆమెనే నా మొదటి భార్య.. బాంబు పేల్చిన రణ్‌బీర్
ఇక, ప్రభుత్వ భూములు, లిక్కర్ అమ్మకం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చూస్తున్నారని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్షనేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యయం, మూల ధన వ్యయం సమానంగా ఉంది.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది.. కాబట్టి తాము అదే దారిలో పోతాం అన్నట్లు ప్రస్తుత ప్రభుత్వ తీరు ఉంది.. సుపరిపాలన, సంక్షేమ ప్రభుత్వం కాదు కమీషన్ల ప్రభుత్వం అని ఆరోపించారు. తెలంగాణ నమూనా అంటే కమిషన్లు, కూల్చివెతలు, హామీల ఎగవేతనా?.. మేనిఫెస్టోలో లేని ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తానని చెప్పి ఇచ్చిన హామీలను విస్మరిస్తుంది.. ఫోర్త్ సిటీ పేరుతో లంకె బిందెల కోసం పాకులాడుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ అంటుంది కానీ పేద ప్రజల్లో రైజింగ్ కనబడటం లేదు.. నలుగురు మంత్రుల మధ్యే రైజింగ్ ఉంది.. ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయల అప్పు చేస్తోంది.. జీఎస్టీ పెంచి చూపించడం 71 వేల కోట్లు అప్పు తీసుకురావడానికి చూపిస్తున్నట్లు ఉంది.. ఆరు గ్యారంటీలకు చట్ట భద్దత కల్పిస్తామన్న ముఖ్యమంత్రి మాట తప్పారు.. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Read Also: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం కోసం భార్యను హత్య చేసిన భర్త
అలాగే, కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించే ఆలోచన ఉందా.. ప్రజలను మోసం చేస్తారా?.. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మోసం చేశారు.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు.. పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రైతు డిక్లరేషన్ పై రాహుల్ గాంధీ మాట తప్పడం గా భావిస్తాం.. భూ భారతి మార్గదర్శకాలు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని అడిగారు. ధరణి అవకతవకలను ఎప్పుడు బయట పెడుతారు.. 25 వేల ఎకరాలు చేతులు మారాయని చెప్పారు.. 2.5లక్షల అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ఎందుకు చెప్పడం లేదు.. అన్యాంక్రాంతం అయిన భూములపై సీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. విద్యాశాఖకు 15 శాతం నిధులు ఎందుకు కేటాయించలేదు.. ఫీజు రెగ్యులేటరీ కమిటి వేసి ఫీజులు నియంత్రుస్తామని చెప్పారు.. ఎందుకు ఫీజు రెగ్యులేటరీ కమిటి నియమించలేదు.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే.. 15 నెలలుగా విద్యా శాఖకు మంత్రి లేకపోవడం బాధాకరం అని కమలం పార్టీ శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.