Deputy CM Bhatti: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది అని ఆరోపించారు. వాళ్ల హయాంలో బడ్జెట్‌లో 38 శాతం ఖర్చు పెట్టలేదు, ఆ నిధులను ఎవరికి కేటాయించారు అని అడిగారు. పదేళ్ల పాటు బడ్జెట్‌లలో చాలా నిధుల్ని ఖర్చు పెట్టలేదు, ఆ నిధులకు సంబంధిత వర్గాలకు ఇవ్వలేదు.. వాళ్ల హయాంలో బడ్జెట్ వాస్తవానికి విరుద్ధంగా ఉంది.. బడ్జెట్ ఊహల్లోనో, భ్రమల్లోనో ఉండకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించింది.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని మా ప్రభుత్వం భావించింది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Aurangzeb tomb: ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్..
ఇక, మీలాగా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మీలాగా పెంచితే.. ఈసారి బడ్జెట్ 4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది.. మేము అలా చేయకుండా వాస్తవాల మీద బడ్జెట్ పెట్టామన్నారు. మీకు ఆదాయం ఉన్నా.. లేకున్నా పెంచుకుంటూ పోయారు.. మీలాగే మేము కూడా ప్రజలను భ్రమల్లో పెట్టొద్దని వాస్తవాలు చెప్పుతున్నాం.. పెడతాం అంటే వస్తారు.. కొడతాం అంటే పారిపోతారు పేదలు, సామన్య ప్రజలు.. ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు.. చేయాల్సింది చెప్ధమని.. బడ్జెట్ కుదించి పెట్టాం.. చేయగలిగేవే బడ్జెట్ లో పెట్టాం.. హరీష్ రావు చెప్పిన మాటలు విన్నాకా.. ఇవన్నీ చెప్పాలని డిసైడ్ అయ్యా.. మీకు డిసిప్లేన్ లేదంటూ మండిపడ్డారు. అందుకే అడ్డగోలుగా ఖర్చు చేశారు.. జీఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది అన్నాడు హరీష్ రావు.. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ 8.4గా ఉంది.. ఇప్పుడు జీఎస్టీ 12.3 శాతం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయించాలి..
అయితే, హరీష్ విద్యావంతుడు.. భాష పట్ల కొంత పద్ధతిగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హరీష్ రావు లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు అనుకోలేదు.. విజ్ఞాన వంతులుగా సభ నడుపుకుందాం.. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు.. మేము ఏడాదిన్నర అయ్యిందని పేర్కొన్నారు. గత పదేళ్లలో 13 లక్షల 80 వేలు కోట్లలో.. అప్పు లక్ష 40 వేల కోట్లు.. పనులు చేసిన వాటికి బిల్లులు ఇవ్వానిది రూ. 40 వేల కోట్లు.. 16 లక్షల 70 వేల 711కోట్లు పదేళ్లు ఖర్చు పెట్టారు.. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టారా?.. బీడీఎల్ కట్టారా.. ఈసీఎల్ కట్టారా అని అడిగారు. కాళేశ్వరం ఏమైంది.. తెలంగాణ ప్రజల కండ్ల ముందే కూలిపోయింది.. ఆర్థిక అరాచకం సృష్టించింది మీరు.. తగుదునమ్మా అని మాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటారు.. బుద్ధి మాంద్యం అంటారు.. మేము అధికారంలోకి వచ్చాక.. రెండు లక్షల 80, 603 కోట్లు ఖర్చు చేశాం.. జీతాలు రూ. 77, 362 కోట్లు.. అప్పులకు కట్టినవి రూ. 8,80,09 కోట్లు.. లక్ష 34 వేల కోట్లు పథకాల కోసం ఖర్చు చేశాం.. వచ్చిన ఆదాయం 2,80,603 కోట్లు.. ఖర్చు 2 లక్షల 99.421 కోట్లు అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.