Harish Rao: రాష్ట్ర శాసన సభ చరిత్ర లో ఇది చీకటి రోజు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభ వాయిదా వేశారు.. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది.. 20 శాతం కమిషన్ ఏ ప్రభుత్వం హయంలో జరగలేదు.. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టులు కట్టాం.. రైతు బంధు ఇచ్చాం, 2 వేల పెన్షన్ పెంచాం.. మా హయంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు.. మహిళలకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారాని అడిగితే సభ వాయిదా వేశారు.. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అని ప్రకటించారు.. ఆనాడు నో LRS అన్నారు.. ఇప్పుడు ఉచితంగా చేయమంటే దాట వేశారు.. పేద ప్రజల రక్తం పిండి LRS వసూలు చేస్తామని భట్టి చెబుతున్నాడు.. ఫీజ్ రీంబర్స్మెట్ విషయంలో కూడా స్పందించడం లేదు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Shalini Pandey : డ్రెస్ మార్చుకుంటున్న టైమ్ లో ఆ డైరెక్టర్ కారవాన్ లోకి వచ్చాడు..
ఇక, ఇసుకపై మా ప్రభుత్వంలో రూ. 5000 కోట్లు ఆదాయం పెంచామని హరీష్ రావు తెలిపారు. రైతులకు 31 వేల కోట్ల రూపాయల రుణ మాఫీపై అడిగితే సమాధానం లేదు.. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించారు అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నారు.. కార్యకర్తలకు రాజీవ్ యువ వికాసం పేరుతో దోచి పెడుతామంటున్నారు అని ఆరోపించారు. అలాగే, పోలీసులకు సరేండర్ లీవులు ఇవ్వడం లేదు.. అక్క చెల్లెళ్లకు ప్రకటించిన హామీలు ఇవ్వకుండా.. అందాల పోటీలు పెడుతున్నాం అంటున్నారు.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభ వాయిదా వేసి పారిపోయారు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.