Road Accident: యాదగిరిగుట్ట జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు (మార్చ్ 26) తెల్లవారు జామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ను వెనుక నుంచి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి.
మీరు పదేండ్లు అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు మేం పదేండ్లు అధికారంలో ఉంటాం.. ప్రజల జీవితాలను బాగు చేస్తామన్నారు. మూడేండ్లు ప్రజల కోసం కలిసి పని చేద్దాం.. ఎన్నికల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు వచ్చి సలహాలిచ్చిన స్వీకరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Heavy Rain: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం పడుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురుస్తోంది. కాగా, హైదరాబాద్ పరిధిలో బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాలలో కురుస్తుంది వర్షం.
Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు.
Minister Komatireddy: నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.. పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయారు అని మండిపడ్డారు.
Anchor Shyamala: ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల.. రెండున్నర గంటలకు పైగా శ్యామలను పోలీసులు విచారణ చేశారు. ఇక, విచారణ అనంతరం శ్యామల మాట్లాడుతూ.. విచారణ సమయంలో మాట్లాడటం సమంజసం కాదు అని పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాను.. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరు భర్తీ చేయలేరు.. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్లకు పాల్పడటం తప్పు అని ఆమె తెలిపారు. Read Also: Local Body […]
Local Body MLC Election: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది.
Lawyer Murder Case: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు.
ASHA Workers Protest: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.