త్వరలోనే రాహుల్ గాంధీకి ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ప్రకటించాడు.. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడే వెల్లడించారు.. అందులో భాగంగానే.. దేశంలోనే మొట్ట మొదట తెలంగాణలో కులగణన చేశామని వి. హన్మంతరావు తెలిపారు.
కృష్ణా జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేఆర్ఎంబీ చెప్తుంది.. ఈడీ చార్జ్ షీట్ లో తన పేరు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు వెళ్లారు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Deputy CM Bhatti: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు.. ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే అని చెప్పాను.. భద్రాద్రి, యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు.. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగుతున్నాం.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు ఉందన్నారు. కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటారు.. ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారు.. గత ఆరు నెలల్లో సకాలంలో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వల్లనే “కులగణన” సాకారం కాబోతుంది.. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపడం, తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యాం అని ఆయన పేర్కొన్నారు. రాహల్ గాంధీ డిమాండ్, ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా “కుల గణన” కు నిర్ణయం తీసుకుంది.
Peace Committee: ఛత్తీస్గఢ్లో మే 21వ తేదీన జరిగిన ఎన్ కౌంటరులో చనిపోయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా మిగతా మావోయిస్టులందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పాలని పీస్ కమిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీలు వణికిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని తెలిపారు. ఉగ్రవాదానికి ఈరోజు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలిచింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.