Fatehnagar Flyover: కనీస మెయింటెనెన్స్ లేక ఫతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పెచ్చులూడుతుంది. బాలానగర్ నుంచి బల్కంపేట, సనత్ నగర్ వెళ్ళేందుకు నిర్మించిన ఫతే నగర్ బ్రిడ్జి.. రద్దీ ప్రదేశం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తి రద్దీతో ఉంటుంది.
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపింది.
PBKS vs MI: ఐపీఎల్ 2025 మెగా టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. అయితే, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన.. ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Formula E Scam Case: ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. మరోవైపు, ఫార్ములా-ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Maoist's Letter: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు.
హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం కురిస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో వర్షం పడుతుంది.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఆర్జీయూకేటీ బాసర ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు అయింది.
మన పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పండబెట్టి తొక్కే విదంగా ఓడించాలి.. మీ ఆవేశం చూస్తుంటే రాబోయే గద్వాల ఉప ఎన్నికల్లో మనం సామాన్య వ్యక్తిని పెట్టినా గెలుస్తాం అన్నారు.. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని అని అందరూ అడుగుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.