Rain In Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది.
Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ( మే 27వ తేదీ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో త్రిమెన్ కమిటీ అధికారుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు వారు వివరించారు.
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్దతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు.
IPL 2025 Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా కనిపించబోతుంది. ఇందుకోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ను విజయవంతం చేసిన మన భద్రతా దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించాలని ప్లాన్ చేసింది.
BJP MP Laxman: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారు అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు మోడీ.. దేశంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుంది అని గుర్తు చేశారు. కానీ, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు.
Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది.
Rain Alert In TG: తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ కేంద్రం వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేయగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది.
MP Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుంది.. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారు.