Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీలు వణికిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని అండర్‌పాస్‌లు నీటితో నిండి పోవడంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మరోవైపు, ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలోని ఎయిర్‌పోర్టులో సుమారు 200 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.
Read Also: Preity Zinta : ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ఇచ్చిన నటి ప్రీతి జింతా..
అయితే, శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి కలిపే అండర్ పాస్ రోడ్డుపై భారీగా వర్షం నీరు చేరుకుంది. దీంతో, భారీగా కార్లు, బస్సులు నీట మునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సూచనలు జారీ చేసింది. భారీ వర్షం కారణంగా ఇప్పటికే ఢిల్లీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
DELHI IN A DEPLORABLE CONDITION AFRET HEAVY RAINS⚡️⛈️
Roads waterlogged even the highways, underpass blocked, even the lamp posts broken & fallen, blocking the roads; are common scenarios.#Delhi #DelhiWeather #DelhiNCR #delhirain pic.twitter.com/6me4kpSbMn
— Barbarik (@Sunny_000S) May 25, 2025
Bengaluru, Mumbai, Delhi, divided by language, united by turning into river rafting spots within 15 minutes of rain.
This is an underpass in Delhi Cantt. Doesn’t seem like an old construction. Wonder why we don’t focus much on drainage and stormwater management. pic.twitter.com/NJ6wqfXJnx
— THE SKIN DOCTOR (@theskindoctor13) May 25, 2025