National Herald Case: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు గుప్పించింది.
Jairam Ramesh: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు.
Ranya Rao Gold Smuggling Case: బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన నటి రన్యా రావు కేసులో కీలక ఈడీ దూకుడు పెంచింది. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరతో సంబంధం ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కాలేజీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు చేస్తుంది.
Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్‌తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది.
మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దని ఎంఎస్ ధోనీ తెలిపారు. సీనియర్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకోండి.. యువ ఆటగాళ్లు 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టం.. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారు సొంతం చేసుకోవాలని ఎంఎస్ ధోనీ పేర్కొన్నారు.
Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
Cyber Terror Activities: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల దాడి చేస్తారనే హెచ్చరికలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు వచ్చింది. దీంతో భారత వ్యతిరేక సందేశాలను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ ఏటీఎస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముఖాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో జత చేసి 'వన్ అజెండా' అని రాసిన పోస్టర్‌ను కమలం పార్టీ సమాచార్ శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Spy Jyoti Malhotra: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా వాటిని ఆ డైరీలో రాస్తుంటుంది.
Terrorists: పహల్గామ్ ఉగ్రవాద దాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతుంది. టెర్రరిస్టులు సైనికుల దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతుంది.. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానిక ప్రజలు.