వినాయక చవితి శుభపర్వదినం సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్న “ధర్మవరం” సినిమా పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఘనంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ […]
‘తండేల్’ సినిమా సక్సెస్ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ బి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లాపతా లేడీస్’ సినిమా హీరో స్పర్ష్ శ్రీవాస్తవను తీసుకున్నారు . కిరణ్ […]
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌కు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సినిమాకు సంబంధించి ఒక కీలకమైన కొత్త పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. శోభ అనే పాత్రలో నటి […]
బిగ్ బాస్ 9 తెలుగు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన షో మొదలు కానుంది. కానీ ప్రధాన షో కంటే ముందే, జియో+ హాట్‌స్టార్ “అగ్నిపరీక్ష”తో ప్రేక్షకులకు ఒక టీజర్‌ను అందించింది. ఈ పేరులోనే కథ మొత్తం దాగి ఉంది. “అగ్నిపరీక్ష” అంటేనే అగ్నిలో నుంచి నడిచి బయటకు వచ్చినట్టు, అందుకే ఇది కేవలం సాధారణ టాలెంట్ షో కాదని ఒక్క ఎపిసోడ్ చూసిన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి, […]
టాలీవుడ్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్న, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 ‘గ్లోబ్‌ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కెన్యాలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కెన్యాకు బయలుదేరిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ఖరారైంది. ప్రయాణంలో ఆమె కెన్యాలో లభించే ‘కెన్యాన్ చెవ్డా’ అనే ప్రముఖ ఇండియన్ స్నాక్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా ‘గ్లోబ్‌ట్రాటర్’ […]
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక నోట్ కూడా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ 2’ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఇండియన్ సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. Also Read:Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్ […]
నటనలో తనదైన ముద్ర వేసుకున్న టాలీవుడ్ వెటరన్ నటుడు మోహన్ బాబు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకున్నాడు. ఇటీవల ఆయన మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అంతకు ముందు ‘శాకుంతలం’, ‘సూరారై పోట్రు’ వంటి చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఆయన నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఘట్టమనేని జయకృష్ణ తొలి […]
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు […]
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా “వేదవ్యాస్”తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పేరుగాంచిన కృష్ణారెడ్డి, మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వి.వి. వినాయక్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Also Read:Anushka Shetty : ఘాటి ప్రమోషన్స్‌కి దూరంగా […]
తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు, తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాద అంశం మీకు గుర్తుండే ఉంటుంది. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తను డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’ ప్రివ్యూ చూస్తుండగా ఊహించని విధంగా జూలై నెలలో బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలి మరణించారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ […]