రష్మిక హీరోయిన్‌గా నటించిన హిందీ ‘దామా’ మూవీ అక్టోబర్ 21వ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి, మంగళవారం నాడు సినిమాలు రిలీజ్ అవ్వవు. కానీ, దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వరుసగా హారర్ సినిమాలతో హిట్టు కొడుతున్న హిందీ ‘మేడాక్’ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధికి, హరీష్ రావల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
Also Read:Delhi: ఢిల్లీలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న పొల్యూషన్.. పడిపోయిన గాలి నాణ్యత
డిసెంబర్ 2024లో ప్రారంభమైన ఈ సినిమాని ఏడాదిలోపే పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక యాక్టివ్‌గా ఉంది. కానీ, ఆమెకు ఎంగేజ్‌మెంట్ గురించిన ప్రశ్నలు ఎదుర్కాలేదు. కానీ, ఆమె నటించిన మరో సినిమా ‘గర్ల్ ఫ్రెండ్’ వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్స్ కచ్చితంగా తెలుగులో చేయాల్సిందే. తెలుగు మీడియా గురించి తెలిసిందే కదా, ఒకవేళ రష్మిక కనుక తెలుగు మీడియా ముందుకు వస్తే, ఖచ్చితంగా ఆమెను సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ గురించి ప్రశ్నిస్తారు. ఈ విషయం మీద రష్మిక ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.