యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం తెలుగులో ప్రామిసింగ్ హీరోగా మారాడు. జాంబీరెడ్డి నుంచి తేజ దాదాపు అన్ని సినిమాలు హిట్లు కొడుతూ వస్తున్నాడు. ముందుగా జాంబీరెడ్డి, తర్వాత హనుమాన్, ఈ మధ్యకాలంలో మిరాయ్ సినిమాతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే, జాంబీరెడ్డి సీక్వెల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకి తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. అయితే, దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ, అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది.
Also Read : TheyCallHimOG : సుజీత్ – దానయ్య కు మధ్య గొడవలు.. కీలక ప్రకటన చేసిన దర్శకుడు
దాదాపుగా రూ. 42 కోట్ల రూపాయలకి లీడింగ్ ఓటీటీ సంస్థ ఆ హక్కులు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి, తెలుగులో తేజ కంటే సీనియర్ హీరోల సినిమాలకు కూడా ఓటీటీ డీల్స్ క్రాక్ అవ్వడం గగనం అయిపోతుంది. కానీ, తేజ సజ్జ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ విధమైన ఓటీటీ డీల్ క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.