విశాల్ రెడ్డి తెలుగువాడే అయినా, తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. అక్కడ స్టార్ ఏమీ కాదు, మంచి మార్కెట్ ఉన్న హీరో. అయితే ఏం లాభం, ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఫైనాన్షియల్ వివాదంలో చిక్కుకుంటే, మరోసారి అక్కడ నటీనటుల సంఘం వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా నోరు పారేసుకుని హైలెట్ అయ్యాడు. తాజాగా అతను అవార్డుల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా విశాల్ మాట్లాడుతూ తాను అవార్డులను నమ్మనని చెప్పుకొచ్చాడు. నేషనల్ అవార్డులు సైతం తనకు నమ్మకం లేదని, అసలు వాళ్ళు ఎవరు బెస్ట్ అనేది డిసైడ్ చేయడానికి? నాకు అవార్డు రాలేదని ఈ మాటలు చెప్పడం లేదు. ఒకవేళ వచ్చినా, ఇంటికి తీసుకు వెళ్లే దారిలోనే వాటిని చెత్తకుప్పలో పడేస్తాను అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. ని
Also Read:Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర
జానికి, విశాల్‌కి ఇప్పటికీ చెప్పుకోదగ్గ అవార్డులు ఏవీ లభించలేదు. అంతమాత్రాన అవార్డుల మీద నోరు పారేసుకోవడం అవసరమా? జాతీయ అవార్డులు సహా మిగతా అవార్డులు సైతం జ్యూరీ మెంబర్‌లు డిసైడ్ చేస్తారు. ఆ జ్యూరీ మెంబర్‌లు ఏమీ అల్లాటప్పా వ్యక్తులు ఉండరు. ఎంతో కొంత అనుభవం ఉన్న వారిని జ్యూరీ మెంబర్‌లుగా నియమించి అవార్డులు ఎంపిక చేస్తారు. మీకు అవార్డుల మీద మంచి అభిప్రాయం లేకపోతే చెప్పి ఉండవచ్చు. కానీ, చెత్తకుప్పలో పడేస్తాను అనే అంత నోటి దురుసుతనం పనికిరాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఇవి తగ్గించుకుంటే మంచిది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి