చాలా తక్కువ మంది దర్శకులు తమ శిష్యులను కూడా దర్శకులుగా సిద్ధం చేసి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇప్పిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సుకుమార్ మొదటి వరుసలో ఉంటాడు. ఇప్పటికే ఆయన శిష్యులు బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు వంటి వాళ్లు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన మరో ఇద్దరు శిష్యులను దర్శకత్వ రంగ ప్రవేశం చేయించడానికి రంగాన్ని సిద్ధం చేశారు. అందులో ఒకరు వీర. కిరణ్ అబ్బవరం హీరోగా వీర దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. గత కొద్ది రోజుల క్రితం ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి.
Also Read:Zombie Reddy 2 : సెట్స్ కు కూడా వెళ్ళకుండానే షాకింగ్ ఓటీటీ డీల్
ఇప్పుడు సుకుమార్ శిష్యుల బ్యాచ్‌లో మరో దర్శకురాలు తెర మీదకు వచ్చింది. మాధురి అనే పేరు గల అమ్మాయి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె ఇప్పుడు సుమంత్ ప్రభాస్ హీరోగా ఒక ప్రాజెక్ట్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టులన్నీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద సుకుమార్ నిర్మించబోతున్నారు. సుకుమార్ బ్యానర్‌తో పాటు మరో బ్యానర్‌ని కూడా ఇంక్లూడ్ చేసి, ఫైనాన్షియల్స్ అన్నీ ఆ బ్యానర్ చేత పెట్టిస్తారని, క్రియేటివ్స్ అన్నీ సుకుమార్ దగ్గరుండి చూసుకుంటారని తెలుస్తోంది. మొత్తం మీద శిష్యులను దర్శకులుగా మారుస్తున్న ఘనత సుకుమార్‌కి దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు