తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (స్రీనివాస కుమార్) తెలుగు హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. వైష్ణవి చైతన్య నటించిన తాజా చిత్రం ‘జాక్’ లోని ఓ కిస్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా […]
బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడని కేసు నమోదైన క్రమంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, […]
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి చేరింది. ఈ యాప్స్‌ను ప్రచారం చేసిన యూట్యూబర్లు, వారికి జరిగిన చెల్లింపులు మరియు ఆర్థిక లావాదేవీలపై ఈడీ తీవ్రంగా విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ మరియు హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన వివరాలను ఈడీ తెప్పించుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేందుకు […]
గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఒక యూట్యూబర్‌తో కలిసి వీసీ సజ్జనర్ చేసిన ఒక ఇంటర్వ్యూ తర్వాత వరుసగా వారందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ సహా మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక నటి, హీరోయిన్ మంచు […]
వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సేతుపతి చేసే సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కథ చెప్పి ఒప్పించిన పూరీ జగన్నాథ్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఒక హిట్ తర్వాత రెండు […]
అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో "కోర్ట్" సినిమా టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై అందిన సమాచారం ఆధారంగా, రీజనల్ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కె. మాధవి, మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో) అశోక్ నేతృత్వంలో అధికారుల బృందం థియేటర్లో తనిఖీలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీల సందర్భంగా, "కోర్ట్" సినిమా టికెట్ ధర నిబంధనల ప్రకారం 110 రూపాయలుగా ఉండాల్సి ఉండగా, థియేటర్ యాజమాన్యం దానిని 150 రూపాయలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
బిచ్చమెత్తని ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతో “ధర్మ యుగం” అనే సందేశాత్మక పాటను స్ఫూర్తి విజేత విద్యా సంస్థలు విడుదల చేశాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో “ధర్మ యుగం – హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పాటను ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఈ పాటను రూపొందించారు. సామాజిక బాధ్యతను చాటే ఈ ప్రయత్నం సమాజంలో అందరూ […]
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది.
టాలీవుడ్లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య విడిపోయి దాదాపు మూడేళ్లు గడిచాయి. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, వారి వ్యక్తిగత జీవితాలపై అభిమానులు, సినీ ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంది. తాజాగా సమంత నాగచైతన్యతో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జంట విడిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే, సమంత […]
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే 11 మంది సోషల్ మీడియా సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పుడు హీరోయిన్, నటి మంచు లక్ష్మి కూడా చిక్కుల్లో పడింది. మంచు లక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ లకి ప్రమోషన్ చేస్తూ మంచు లక్ష్మి ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]