తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (స్రీనివాస కుమార్) తెలుగు హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. వైష్ణవి చైతన్య నటించిన తాజా చిత్రం ‘జాక్’ లోని ఓ కిస్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆమెను ఎస్కేఎన్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా వైష్ణవి స్పష్టంగా తెలిపారు, “ఎస్కేఎన్ తెలుగమ్మాయిల గురించి మాట్లాడిన విషయం నాకు తెలుసు కానీ ఆయన ఎవరి గురించి చెప్పారో నాకు అవగాహన లేదు.” అని ఆమె అన్నారు. అంతేకాక ఆయన అలా ఎందుకు అన్నారో తరువాతి రోజు వీడియో రిలీజ్ చేశారని అన్నారు.
Betting Apps Case : ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు!
ఇక గతంలో ఎస్కేఎన్, ‘డ్రాగన్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో “తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలిసింది. ఇకపై తెలుగు రాని హీరోయిన్లనే ప్రోత్సహిస్తాం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చాలా మంది వైష్ణవి చైతన్యను ఉద్దేశించినవేనని ఊహాగానాలు వచ్చాయి. కారణం, వైష్ణవి ఎస్కేఎన్ నిర్మించిన ‘బేబీ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందారు. అయితే, వైష్ణవి తాజా స్పందనతో ఈ ఊహాగానాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘జాక్’ సినిమా రిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవి తన కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్నారు. కిస్ సాంగ్‌తో సహా సినిమాలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.