“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పిల్లల మనసుల్లో మంచి విత్తనాలు నాటి, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మరోసారి సమాజానికి సందేశం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో, సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆయన రూపొందిస్తున్న తాజా బాలల చిత్రం “అభినవ్ (Chased Padmavyuha)”. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, […]
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ మార్చి 21న ‘ఓ అందాల రాక్షసి’ అంటూ అందరి ముందుకు వచ్చారు. షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో తెరకెక్కించారు. మార్చి 21న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ […]
సంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా సినీ నిర్మాత మురళీకృష్ణ చుట్టూ వివాదం చుట్టుముట్టింది. నరసింహనాయుడు సినిమా నిర్మాతగా పేరుగాంచిన మురళీకృష్ణ, పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలో క్రాంతి అనే వ్యక్తితో భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం తాజాగా హింసాత్మక ఘటనగా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. గొంగ్లూర్ గ్రామంలో మురళీకృష్ణ మరియు క్రాంతి మధ్య గత కొన్నేళ్లుగా భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. తాజాగా, క్రాంతి తన పొలానికి కంచె వేసుకునే ప్రయత్నం […]
అనూహ్యంగా దిల్ రాజు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా జరిగిన మోహన్ లాల్ సినిమా L2: ఎంపురాన్ ఈవెంట్లో గేమ్ చేంజర్ ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించాయి. కొంతమంది గట్టిగా నవ్వేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న దిల్ రాజు కూడా నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సీరియస్ అవ్వలేక నవ్వేశాడు. కానీ కెమెరాలో మాత్రం గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ అనే మాట వినగానే దిల్ రాజు నవ్వినట్టుగా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా అయిన RC16 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మరియు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కలిసి ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. […]
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది.
తమిళ సినిమా దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య తాజాగా జరిగిన వీర వీర శూరన్ 2 ప్రెస్ మీట్లో తాను డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరంలో విజయ్, జ్యోతిక జంటగా విడుదలైన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో తనకు కలిగిన అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఎస్ జె సూర్య […]
తెలుగు మోటోవ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన బయ్యా సన్నీ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది, అయితే తదుపరి విచారణను మార్చి 24, 2025కి వాయిదా వేసింది. సన్నీ యాదవ్‌పై మార్చి 5, 2025న నూతనకల్ పోలీస్ […]
ఆ పక్క నాధే ఈ పక్క నాధే తల పైనా ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తాగాలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేదు పుట్టాడ అది మల్ల నేనే నను మించి యేధిగేటోడు ఇంకోడు ఉన్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే అని పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఇప్పుడు అదే సాంగ్ నిజం చేయడానికి రెడీ అయ్యాడు డైరెక్టర్ అట్లీ. […]
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్ కు సిద్ధమవుతోంది. జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్ లో నాట్స్ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ పూర్వపు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అమెరికా నుండి విచ్చేసి […]