సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది. 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడీ సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఎవడే సుబ్రమణ్యం మూవీ ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
READ MORE: Dihuli Massacre: “దిహులి దళితుల ఊచకోత”.. 44 ఏళ్ల తర్వాత తీర్పు.. ముగ్గురికి ఉరిశిక్ష..
నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య విబేధాలపై తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. “విజయ్ నాని ఫ్యాన్ వార్ గురించి నాకు తెలియదు. విజయ్‌కి నాని చాలా సపోర్టు చేసేవాడు. ప్రతి సీన్‌ను ఇద్దరూ చర్చించుకునే వాళ్లు. విజయ్ సీన్‌కి నానీ హెల్ప్ చేసేవాడు. ఇద్దరూ సంతోషంగా గడిపుతున్న వ్యక్తులే. ఆశయంతో ముందుకు వెళ్తున్న వ్యక్తులే. ఇప్పుడు మళ్లీ ఇద్దరినీ కలిపి సినిమా చేయగలుగుతామా అంటే.. ఇప్పటి పరిస్థితులు నేపథ్యంలో చేయలేం.. ఇప్పుడున్న మైండ్ సెట్ మూడు సినిమాల తర్వాత.. కలిపి తీయడానికి నేను ఇష్టపడను. టెక్నికల్‌గా ఇది సాధ్యం కావచ్చు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేను ఆసక్తి చూపను.” అని స్పష్టం చేశారు.