టాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య విడిపోయి దాదాపు మూడేళ్లు గడిచాయి. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, వారి వ్యక్తిగత జీవితాలపై అభిమానులు, సినీ ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంది. తాజాగా సమంత నాగచైతన్యతో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జంట విడిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే, సమంత తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు గతాన్ని వదిలేసే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె గతంలో చైతన్యతో సంబంధం ఉన్న వస్తువులను, గుర్తులను ఒక్కొక్కటిగా మార్చుకుంటూ, తొలగిస్తూ వస్తున్నట్లు సమాచారం. గతంలో ఎంగేజ్మెంట్ రింగ్‌లోని డైమండ్‌ను తీసి, దాన్ని లాకెట్‌గా మార్చుకున్న సమంత, ఈసారి మరో అడుగు ముందుకేసింది.
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్స్ రచ్చలో మంచు లక్ష్మీ?
నాగచైతన్యతో కలిసి వేయించుకున్న టాటూను తాజాగా తొలగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ద్వారా బయటపడింది. ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానులు, నెటిజన్లు దీనిపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. సమంత శరీరంపై ఉన్న టాటూ, ఆమెకు చైతన్యతో ఉన్న సాన్నిహిత్యానికి గుర్తుగా భావించేవారు. దాన్ని తొలగించడం ద్వారా ఆమె ఆ సంబంధాన్ని పూర్తిగా మరచిపోవాలని నిశ్చయించుకున్నట్లు అనిపిస్తోంది. సమంత గత కొంత కాలంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే, తన కెరీర్‌ను బలంగా ముందుకు తీసుకెళ్తోంది. సమంత రాజ్ నిడుమోరు అనే దర్శకుడితో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.