బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే 11 మంది సోషల్ మీడియా సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పుడు హీరోయిన్, నటి మంచు లక్ష్మి కూడా చిక్కుల్లో పడింది. మంచు లక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ లకి ప్రమోషన్ చేస్తూ మంచు లక్ష్మి ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అంతేకాక పలు పెద్ద సినిమాల టీజర్, ట్రైలర్ రిలీజ్ సమయంలో కూడా ఓపెనింగ్ కార్డులోనే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన విషయాన్నీ పలువురు ప్రస్తావిస్తున్నారు.
Animal Dhoni Version: యానిమల్ ‘ధోనీ’ వెర్షన్.. భలే సెట్ అయిందే!
ఇక మరోపక్క బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన కానిస్టేబుల్ కిరణ్ గట్టుపై చర్యలకు రంగం సిద్ధం అయింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న బెట్టింగ్ మాఫియా ఏకంగా కానిస్టేబుల్ కిరణ్ తో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయించింది. పోలీసు యూనిఫాంలో ఉండి కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్ ప్రమోట్ చేసినట్టు గుర్తించారు. టెలిగ్రామ్ చానెల్‌లో బెట్టింగ్ టిప్స్ ఇచ్చిన కిరణ్ గౌడ్ మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. హబీబ్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు అయింది. కిరణ్‌గౌడ్ పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.