Anakapalle: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లిపైనా ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అచ్యుతాపురం మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్లుగా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంకు చెందిన నానాజీ అనే యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. అయితే నానాజీ ప్రేమను ఆ యువతి నిరాకరించింది.
Read Also: Kidney Rocket Cheating: డొనేషన్ పేరుతో కిడ్నీ దోపిడీ.. యువతికి సైబర్ నేరగాళ్ల వల
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలలో యువతి ఫోటోలు పెట్టి తన భార్యగా నానాజీ ప్రచారం చేసుకుంటున్నాడు. గతంలో ఈ అంశాన్ని యువతి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై ఇబ్బంది పెట్టను అని 2020 మార్చి 24న యువకుడు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడు. అయినప్పటికీ యువకుడి తీరులో మార్పు రాలేదు. సదరు యువతిని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే వస్తున్నాడు. ఈ మేరకు ఇటీవల బుధవారం రాత్రి యువతి ఇంటికి వచ్చి యువకుడు హల్‌చల్ చేశాడు. కోడికత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.