Ramanaidu Studio Lands: విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూములపై కీలక నిర్ణయం తీసుకుంది.. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లే ఔట్ కు కేటాయించిన 15.17 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కేవలం ఫిలిం స్టూడియో, అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్స్ కు మధురవాడ గ్రామ సర్వే నెంబర్ 336లో మొత్తం 34.44 ఎకరాల భూమిని కేటాయించింది.
ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో నిర్మాత మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్న చిత్రం '"ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ". ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది .
VenkyAnil3 : టాలీవుడ్ బడా కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ మూడోసారి దర్శకుడు అనిల్ రావు పూడితో జత కట్టాడు. వెంకీ 76 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ తెరకెక్కనుంది. అయితే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించమన్నారు మూవీ మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా సినిమా చాలా రోజుల…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి…
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అదుపు తప్పిందో బీఎండబ్ల్యూ కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది కారు. బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ముప్పు తప్పింది. గాయపడ్డ వ్యక్తిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో నుంచి వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది బిఎండబ్ల్యు కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టిందా కారు. అతివేగం వల్ల రోడ్డు మధ్యలో…