CPI Ramakrishna: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జడ్జీలకు బాధ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్రపతిని ఆదేశిస్తోంది.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని కామెంట్ చేశారు.. అయితే, ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుపై దాడిగానే భావిస్తున్నాం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కె.రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతదేశంలో అధికారంలో ఉన్న పెద్దలు న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారు.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టుపై దాడిగానే భావిస్తున్నాం.. రాష్ట్రాల గవర్నర్ల పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు నచ్చడం లేదు.. దేశంలో ఎమర్జన్సీ నాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు..
Read Also: Anaya Bangar: ఓ క్రికెటర్ నాతో పడుకుంటావా అన్నాడు.. సంజయ్ బంగర్ కుమార్తె షాకింగ్ కామెంట్స్!
వక్ఫ్ లో ఇతర మతస్తులను పెట్టొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగం పై దాడిగా పేర్కొన్నారు రామకృష్ణ.. వక్ఫ్ బిల్లు పై సొలిసిటర్ జనరల్ కూడా సుప్రీంకోర్టును అవమానించే పద్ధతిలో మాట్లాడుతున్నారు.. ప్రమాదకరమైన వక్ఫ్ బిల్లు పాస్ కావడానికి టీడీపీ కారణమవ్వడం దురదృష్టకరం అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చి చంద్రబాబు, నితీష్ కుమార్.. దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టారు.. చంద్రబాబు ఇచ్చిన సవరణలను ఆమోదించకపోయినా.. ఎందుకు బిల్లుకు మద్దతు తెలిపారు? అని నిలదీశారు.. చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాలు పక్కన పెట్టాలని సూచించారు. ఏపీలో కామెడీ రాజకీయం నడుస్తోంది.. రకరకాల కారణాలతో గోశాల ఆవులు చనిపోయుండొచ్చు.. దానికి అంత చర్చ దేనికి..? ఆవుల మృతి పై కరుణాకర్ రెడ్డి చేసిన సూచనలు తీసుకుంటే తప్పేముంది? కూటమి పార్టీలన్నీ కలిసి పక్కా కామెడీ ట్రాక్ నడిపిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు..
Read Also: Bhagavad Gita: భగవద్గీతకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోడీ హర్షం
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు రామకృష్ణ.. రాజధాని అప్పులకు కేంద్రమే ష్యూరిటీ ఇస్తుందని.. చివరకు హడ్కో, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చారన్న ఆయన.. KFW ఒకటి ఉందని చంద్రబాబుకే తెలుసు.. జర్మనీ సంస్థ KFW నుంచి ఐదువేల కోట్లు అప్పుతెచ్చారు.. అమరావతి కోసం 62 వేల కోట్లు అప్పులు తెచ్చారు .. ఈ అప్పుల్లో కేంద్రం ఏమైనా గ్రాంట్ ఇచ్చిందా..? ఈ అప్పును కేంద్రం చెల్లిస్తుందా..? అని ప్రశ్నించారు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి మరో 44 వేల ఎకరాలు తీసుకోవాలని చూడటమేంటి..? అని నిలదీశారు.. సీఎం సొంతజిల్లా చిత్తూరులో అన్నీ మూతపడ్డాయి.. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు మాట్లాడటం లేదు.. 26 జిల్లాల్లో అత్యధికంగా వలసలున్న జిల్లా కర్నూలు.. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఎవరడిగారు నిన్ను.. మే2వ తేదీ మళ్లీ ప్రధాని రావడం దేనికి? అంటూ సీఎం చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ..