న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జడ్జీలకు బాధ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్రపతిని ఆదేశిస్తోంది.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని కామెంట్ చేశారు.. అయితే, ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుపై దాడిగానే భావిస్తున్నాం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కె.రామకృష్ణ..