తమిళ స్టార్ అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్ స్లే, యోగిబాబు, సిమ్రాన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర దర్శకుడు అధిక్ హీరో అజిత్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు..
Also Read : Tamannaah : నేను ఒంటరిదాన్నే.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..
అధిక్ మాట్లాడుతూ.. ‘ నేను ఫ్లాప్ లో ఉన్న టైమ్ లో అజిత్ తప్ప నాకెవ్వరూ ధైర్యం చెప్పలేదు. ఆయన ఇచ్చిన భరోసా ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ముఖ్యంగా ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో క్లియర్‌గా అర్థమైంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెరకెక్కించే సమయంలో ఆయన గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆయన ఒక లెజెండ్. ఎవరినీ బాధపెట్టరు. ఎవరి గురించి చెడుగా మాట్లడరు. చుట్టూ ఉండే వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకున్నాను. ఆయన కోసం ఎన్నో కాస్టూమ్స్ తయారుచేశాం. వాటిని ఎంతో ఓపికగా ధరించారు’ అని చెప్పుకొచ్చాడు.