వల్లభనేని వంశీ మోహన్‌కు మరో సారి షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం..
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది.
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సీఐడీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరారు సీఐడీ పోలీసులు..
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ సాగనుంది.. ముంబై సినీనటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది..