నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఈ జంట భవనాలను సూపర్‌టెక్ అనే సంస్థ నిర్మించింది.
ఈ రెండు భవనాల్లో ఒక్కో ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ విలువ రూ. 1.13 కోట్లు
ఈ భవనాల్లో మొత్తం 915 ఫ్లాట్లున్నాయి, వాటిని అమ్మి ఉంటే ఆ సంస్థకు రూ. 1200 కోట్ల ఆదాయం వచ్చేది
ఇప్పటికే 633 ఫ్లాట్స్ బుక్ అవ్వగా.. అడ్వాన్స్ రూపంలో సంస్థకు రూ. 180 కోట్లు అందాయి
అయితే.. ఇప్పుడు ట్విన్ టవర్స్‌ని కూల్చడంతో ఆ మొత్తాన్ని 12 శాతం వడ్డీతో రీఫండ్ చేయాల్సి ఉంది
నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించడం వల్లే ఈ ట్విన్ టవర్స్‌ని కూల్చారు
ఈ ట్విన్ టవర్స్‌పై.. దగ్గర్లో ఉండే సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీవాళ్లు 2012లో కోర్టుకెక్కారు
2014లో నిర్మాణంలో అవకతవకలు జరిగాయమని తేల్చి, వాటిని కూల్చాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది
అక్కడి నుంచి ఈ కేసు సుప్రీంకోర్టుకి చేరగా.. గతేడాది ఆగస్టులో అలహాబాద్ హైకోర్టు తీర్పుని సమర్థించింది
మూడు నెలల్లోనే కూల్చాలని ఆదేశాలివ్వగా.. సాంకేతిక కారణాల వల్ల, ఏడాది సమయం పట్టింది